యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (UTI): కారణాలు, లక్షణాలు, రోగ నిర్ధారణ & నివారణ చర్యలు

✅ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటే ఏమిటి?

ప్రస్తుత కాలంలో అనేక ఆరోగ్య సమస్యల్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (UTI) ఒక ప్రధానమైన సమస్యగా మారింది. ఇది మూత్ర మార్గాలలో ఏర్పడే ఇన్ఫెక్షన్, ముఖ్యంగా కిడ్నీలు, మూత్రనాళాలు, మూత్రాశయం, ప్రసేకం (యురేత్రా) వంటి భాగాలను ప్రభావితం చేస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరికైనా వచ్చే అవకాశం ఉంటుంది. UTI ఎక్కువగా సూక్ష్మజీవులు, ముఖ్యంగా బ్యాక్టీరియా వలన వస్తుంది. స్త్రీల మూత్రనాళం చిన్నగా ఉండటం, మలద్వారానికి దగ్గరగా ఉండటం వలన పురుషులతో పోలిస్తే స్త్రీలకు ఇది ఎక్కువగా వస్తుంది.

బ్యాక్టీరియా ప్రసేకం ద్వారా మూత్రనాళంలోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్ కలిగిస్తాయి. ఇది మూత్రాశయం వరకు వ్యాపిస్తే సిస్టిటిస్, ప్రసేకాన్ని ప్రభావితం చేస్తే యూరేథరిటిస్, కిడ్నీల వరకు వ్యాపిస్తే పైలోనెఫ్రిటిస్ అని అంటారు. ఈ మూడు రూపాల్లో ఏదైనా ఏర్పడినట్లయితే, వెంటనే గుర్తించి చికిత్స చేయించుకోవడం అత్యంత అవసరం.

💡 గర్భిణీ స్త్రీల్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (UTI):

గర్భధారణ సమయంలో హార్మోన్ల మార్పులు మూత్రనాళం మరియు మూత్రాశయాల్లో సూక్ష్మజీవుల పెరుగుదలకు సహాయపడతాయి. దీనివల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (UTI) వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. UTI గర్భిణీ స్త్రీలకు ప్రమాదకరం, ఎందుకంటే ఇది కిడ్నీలకు వ్యాప్తి చెందితే గర్భంలో ఉన్న శిశువు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. గర్భధారణలో UTI కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించి సరైన చికిత్స చేయించుకోవడం చాలా అవసరం. UTI వల్ల తక్కువ బరువుతో  శిశువు పుట్టడం, గర్భస్రావం మరియు ముందస్తు ప్రసవం వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. అందుకే, సక్రమమైన పర్యవేక్షణతో UTI ని తొలగించడం అత్యంత అత్యవసరం.

🦠యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు గల కారణాలు:

⚠️యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ యొక్క లక్షణాలు

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (UTI) వలన శరీరంలో కొన్ని స్పష్టమైన లక్షణాలు కనిపిస్తాయి. ప్రారంభ దశలోనే ఈ లక్షణాలను గుర్తించి చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం. నిర్లక్ష్యం చేస్తే ఇది కిడ్నీ వరకు వ్యాపించి తీవ్రమైన సమస్యలకు దారి తీసే ప్రమాదం ఉంటుంది.

పై లక్షణాలతో పాటు కిడ్నీ సంబంధిత లక్షణాలు, జ్వరం, వికారం, వాంతులు, చలితో వణుకు రావడం వంటి లక్షణాలు కూడా మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ లకు సంకేతంగా చెప్పవచ్చు.

🛡️యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు రాకుండా నివారణ చర్యలు

మూత్రాశయ ఇన్ఫెక్షన్ సమస్య నుంచి బయట పడాలంటే మన జీవన విధానంలో కొన్ని నియమాలు పాటించడం తప్పనిసరి:

కొంతమంది పురుషుల్లో స్త్రీలలో ఈ మూత్ర కోశ మార్గాల్లో వచ్చే ఇన్ఫెక్షన్ల సమస్యలు మళ్లీ మళ్లీ పునరావృత్తం అవుతుంటాయి. కావున మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ ను ప్రారంభ దశలో గుర్తించి చికిత్స తీసుకోకపోతే తీవ్రమైన కిడ్నీల వైఫల్యానికి కూడా దారితీయవచ్చు. గర్భిణీలు ఈ మూత్ర మార్గ అంటువ్యాధులకు గురైతే తక్కువ బరువు, నెలలు నిండని శిశువులకు జన్మనివ్వడానికి కారణమవుతాయి. మూత్ర నాళాల ఇన్ఫెక్షన్‌లు పురుషుల్లో మూత్ర నాళం సంకుచితం (స్ట్రిక్చర్), సెప్సిస్‌కు కూడా కారణమవుతాయి.

🧪యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (UTI) పరీక్షలు, రోగ నిర్ధారణ

సాధారణంగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ బారిన పడిన వారు వైద్యులను సందర్శించినప్పుడు మూత్ర విసర్జన ఎలా అవుతుంది, మూత్రం ఏ రంగులో వస్తుంది, మూత్రాశయంలో ఇబ్బంది, పొత్తికడుపులో నొప్పికి సంబంధింత ప్రశ్నలు అడగవచ్చు. సాధారణంగా ఎవరైనా మూత్రాశయ ఇన్ఫెక్షన్ సమస్యతో బాధపడుతుంటే మొదటగా మూత్ర పరీక్ష చేస్తారు. ఆ పరీక్షలో యూరిన్‌ రొటిన్‌ & మైక్రోస్కోపీ, యూరిన్‌ కల్చర్‌ సెన్సిటివిటి వంటి టెస్ట్ లు చేసి నిర్ధారణ చేస్తారు. ఈ పక్రియ ద్వార మూత్ర నాళం, మూత్రాశయంలో బ్యాక్టీరియా పెరుగుదల గురించి తెలుసుకోవడానికి వీలుంటుంది. అంతే కాకుండా మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ కు గురైనట్లు నిర్ధారణ అయినప్పుడు USG, CT స్కాన్ మరియు MRI స్కాన్‌ వంటి అధునాతన పరీక్షలు కూడా చేయించుకోమని సలహా ఇవ్వవచ్చు. 

తేలికపాటి నుంచి తీవ్రమైన మూత్రాశయ ఇన్ఫెక్షన్ లకు (UTI) యాంటీ బయాటిక్స్ (సూక్ష్మజీవుల పెరుగుదలను తగ్గించే మందులు) వాడవచ్చు. అంతే కాకుండా ఋతుక్రమం ఆగిపోయిన స్త్రీలు తరచూ మూత్ర వ్యాధులతో బాధపడుతుంటే, యోనికి సంబంధించిన ఈస్ట్రోజెన్ థెరపీ ద్వారా మంచి ప్రయోజనం పొందవచ్చు. ఎవరైనా ఎక్కువ రోజులు మూత్రాశయ ఇన్ఫెక్షన్ వ్యాధులతో బాధపడుతున్నట్లు అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం మంచిది.

💡 మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి – యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ నివారించండి!

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (UTI) వల్ల శరీరం మరియు రోజువారీ జీవితంపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. కావున, తేలికపాటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకుని, మంచి హైజీన్ పాటించడం చాలా ముఖ్యం. మీ ఆరోగ్య సమస్యలకు సమగ్ర పరిష్కారం కోసం డాక్టర్ కె. స్వర్ణలత గారిని సంప్రదించండి. మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటే, ఈ ఇన్ఫెక్షన్ల నుండి దూరంగా ఉండగలుగుతారు.

Dr. K. Swarnalatha

Gynecologist & Infertility Specialist. MBBS, MS (OBG)

UTI సమస్యల్ని గమనిస్తే ఆలస్యం చేయకండి. నిపుణుల సలహా కోసం ఇప్పుడే అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోండి!

Related Post