ఎండాకాలం ఎవరికైనా ఇబ్బందే. కానీ ప్రెగ్నెంట్ మహిళలకు ఇది ఇంకా కష్టం. ఎందుకంటే మామూలు వాళ్ళ కంటే ప్రెగ్నెన్సీతో ఉన్నవారి ఒంట్లో వేడి కొంచెం ఎక్కువగా ఉంటుంది. దానికి తోడు బయట వాతావరణంలో ఉండే వేడి వల్ల త్వరగా అలిసిపోతారు. నెలలు నిండే కొద్దీ కాళ్ల వాపులు రావడం సహజం, ఈ ఎండాకాలంలో ఈ వాపులు ఇంకా ఎక్కువ అవుతాయి. మరి ఈ ఎండల నుండి తల్లి కాబోయే వారు ఎలా జాగ్రత్త పడాలో ఇప్పుడు సింపుల్ గా తెలుసుకుందాం.
నీళ్లు బాగా తాగాలి: రోజుకు 3-4 లీటర్ల నీళ్లు తాగాలి. బయటకు వెళ్తే గంటకోసారి నీళ్లు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ, లేదా నిమ్మరసం తాగండి. దీనివల్ల నీరసం రాదు.
కాటన్ బట్టలే వేసుకోండి: వదులుగా ఉండే కాటన్ బట్టలు మాత్రమే వేసుకోండి. దీనివల్ల గాలి బాగా ఆడి, చెమటకాయలు రాకుండా ఉంటాయి.
ఎండలో తిరగద్దు: ఉదయం 10 నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎండలో బయటకు వెళ్లకండి. వెళ్లాల్సి వస్తే గొడుగు, సన్‌స్క్రీన్ తప్పనిసరిగా వాడండి.
వ్యాయామం (వాకింగ్): ఉదయం లేదా సాయంత్రం ఎండ లేనప్పుడు మాత్రమే వాకింగ్ చేయండి. బాగా అలిసిపోయే పనులు చేయొద్దు.
రెస్ట్ తీసుకోండి: మధ్యాహ్నం భోజనం చేశాక కనీసం అరగంట పడుకోండి లేదా రెస్ట్ తీసుకోండి.
కాళ్ళ కింద దిండు: కూర్చున్నా, పడుకున్నా కాళ్ళ కింద ఒక దిండు పెట్టుకోండి. దీనివల్ల కాళ్ల వాపులు తగ్గుతాయి.
మెత్తటి చెప్పులు: హై హీల్స్ అస్సలు వాడొద్దు. ఫ్రీగా, మెత్తగా ఉండే చెప్పులు వేసుకోండి.
ఉంగరాలు తీసేయండి: చేతి వేళ్లు వాచే అవకాశం ఉంది కాబట్టి, ఉంగరాలు తీసేయడం మంచిది. లేదంటే రక్త ప్రసరణకు ఇబ్బంది అవుతుంది.
టైట్ బట్టలు వద్దు: నడుము దగ్గర బిగుతుగా ఉండే టైట్ బట్టలు అస్సలు వేసుకోవద్దు.
ఎక్కువ సేపు నిలబడొద్దు: ఒకే చోట ఎక్కువ సేపు నిలబడటం వల్ల కాళ్ల వాపులు వస్తాయి. కాబట్టి మధ్యలో కూర్చొని రెస్ట్ తీసుకోండి.
ఉప్పు తగ్గించండి: కూరల్లో ఉప్పు కొంచెం తగ్గించండి. అలా అని పూర్తిగా మానేయొద్దు.
సొంత వైద్యం వద్దు: డాక్టర్ కి చెప్పకుండా మీకై మీరు సొంతంగా ఏ మందులు వేసుకోవద్దు.
ఎండాకాలంలో జీర్ణశక్తి కొంచెం మందగిస్తుంది, కాబట్టి ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
ఏం తినాలి?: పుచ్చకాయ, కీరదోస, ద్రాక్ష, నారింజ లాంటి నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు రోజూ తినండి. పెరుగన్నం, మజ్జిగ, సలాడ్స్ లాంటి తేలికగా అరిగే ఆహారం తీసుకోండి.
ఏం తినకూడదు?: బాగా కారం, మసాలాలు ఉన్న కూరలు, బయట దొరికే జంక్ ఫుడ్, నూనెలో వేయించిన పదార్థాలు తగ్గించండి. ఇవి ఒంట్లో వేడిని పెంచి గ్యాస్, ఎసిడిటీకి దారి తీస్తాయి.
మీరు ఎండలో ఉన్నా, ఇంట్లో ఉన్నా ఈ క్రింది లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు:
కళ్లు తిరగడం
బాగా నీరసంగా అనిపించడం
వాంతులు కావడం లేదా వికారం
విపరీతమైన దాహం వేయడం
ఇలా జరిగితే వెంటనే డాక్టర్ ని కలవండి.
ఈ ఎండాకాలాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. పైన చెప్పిన చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తూ, ఆహారం విషయంలో, బట్టల విషయంలో శ్రద్ధ వహిస్తే చాలు. మీ శరీరానికి కావాల్సినంత విశ్రాంతినివ్వండి. ఈ అందమైన ప్రయాణాన్ని ఆస్వాదించండి.
మీకు ఏ చిన్న అనుమానం వచ్చినా, అనారోగ్యంగా అనిపించినా ఆన్‌లైన్‌లో వెతుక్కుని కంగారు పడకండి. వెంటనే సురక్ష హాస్పిటల్, జమ్మికుంట లో మమ్మల్ని సంప్రదించండి. మీ ఇద్దరి క్షేమమే మా బాధ్యత!
– డాక్టర్ స్వర్ణలత
Gynecologist & Infertility Specialist. MBBS, MS (OBG)
Suraksha Multi-Speciality Hospital is committed to providing advanced, compassionate, and patient-centered healthcare. With expert doctors and modern facilities, we ensure quality treatment for all.
Expert care with advanced technology for patient-focused treatment.