గర్భధారణ ప్రతి మహిళ జీవితంలో ఒక అద్భుతమైన ప్రయాణం. ఈ కాలంలో శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. ఆ మార్పుల వల్ల కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు రావడం సహజం. ఇవి ఎక్కువగా హార్మోన్ మార్పులు మరియు బిడ్డ పెరుగుదల కారణంగా వస్తాయి. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు — సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యలు సులభంగా తగ్గిపోతాయి.
ఇప్పుడు గర్భధారణలో ఉన్న మహిళలకు సాధారణంగా వచ్చే కొన్ని సమస్యలు, వాటి కారణాలు మరియు పరిష్కారాలను తెలుసుకుందాం.
దీన్ని ‘మార్నింగ్ సిక్‌నెస్’ అంటారు గానీ, ఇది పొద్దున్నే రావాలని ఏమీ లేదు. పగలైనా, రాత్రైనా ఎప్పుడైనా రావచ్చు. కొన్ని వాసనలు, కొన్ని రుచులు పడకపోతే ఇలా వికారంగా అనిపిస్తుంది. గర్భం వచ్చిన మొదటి నెల, రెండు నెలల్లో ఇది ఎక్కువగా ఉంటుంది. ఇది గర్భవతులలో చాలా సాధారణం, దీనివల్ల మీ బిడ్డకు ఎలాంటి ప్రమాదం ఉండదు.
గర్భం రాగానే మన శరీరంలో hCG అనే హార్మోన్ బాగా పెరుగుతుంది. దాని వల్లే ఈ వికారం, వాంతులు వస్తాయని డాక్టర్లు అంటారు. దాంతో పాటు, ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్ల వల్ల కూడా జీర్ణశక్తి కొంచెం నెమ్మదించి, తిన్నది సరిగ్గా అరగనట్లు అనిపిస్తుంది.
గర్భధారణలో ఉన్న మహిళల్లో దాదాపు 50% మందికి నడుము నొప్పి అనుభవమవుతుంది. ఇది ఆరో నెల తర్వాత ఎక్కువగా కనిపిస్తుంది మరియు కొంతమందిలో ప్రసవం తర్వాత కూడా కొన్ని వారాలు కొనసాగుతుంది.
కారణం:
బిడ్డ పెరుగుతున్న కొద్దీ గర్భాశయం విస్తరిస్తుంది. దీని వల్ల వెన్నుపూసపై ఒత్తిడి పెరిగి నడుము నొప్పి వస్తుంది.
గర్భంతో ఉన్నప్పుడు ఛాతీలో మంటగా అనిపించడం, త్రేన్పులు రావడం, గ్యాస్ పట్టేయడం వంటివి మామూలే.
ఈ సమస్య ఎందుకు వస్తుంది? ఈ టైంలో హార్మోన్ల వల్ల మనం తిన్నది సరిగ్గా, తొందరగా అరగదు. దానివల్ల కడుపులో యాసిడ్ పైకి తన్నినట్లు అనిపించి ఛాతీలో మంటగా ఉంటుంది.
ఛాతీలో మంట లేదా గ్యాస్ సమస్య మరీ ఎక్కువగా ఉంటే, మీ సొంతంగా మందుల షాపులో బిళ్ళలు తీసుకుని వేసుకోకండి.
కొన్ని మందులు గర్భధారణ సమయంలో తీసుకుంటే, కడుపులో ఉన్న బిడ్డకు హానికరం కావచ్చు.
అందువల్ల ఎప్పుడూ డాక్టర్ సూచనతో మాత్రమే మందులు వాడండి.
సురక్ష హాస్పిటల్‌లో మా నిపుణ వైద్యులు, మీ ఆరోగ్యానికి మరియు బిడ్డ భద్రతకు పూర్తిగా సురక్షితమైన మందులు సూచిస్తారు.
ఏ చిన్న సమస్య ఉన్నా కూడా నిర్భయంగా మమ్మల్ని సంప్రదించండి – మేము ఎల్లప్పుడూ మీతో ఉన్నాం.
Gynecologist & Infertility Specialist. MBBS, MS (OBG)
Suraksha Multi-Speciality Hospital is committed to providing advanced, compassionate, and patient-centered healthcare. With expert doctors and modern facilities, we ensure quality treatment for all.
Expert care with advanced technology for patient-focused treatment.